Palakonda: పాలకొండలో లేబర్ కోడ్స్ పేపర్ల దగ్ధం.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఐటీయూ నిప్పులు!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ నిబంధనలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Palakonda: పాలకొండలో లేబర్ కోడ్స్ పేపర్ల దగ్ధం.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఐటీయూ నిప్పులు!
పాలకొండ (పార్వతీపురం మన్యం జిల్లా): పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పేపర్లను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం భారతదేశ కార్మికులను మరింత దోపిడీ చేసేందుకు పెట్టుబడుదారులకు అవకాశం కల్పిస్తూ లేబర్కోడ్స్ కి నిబంధనల్ని నోటిఫై చేసిందని అన్నారు.గతంలో కూడా బీహార్ ఎన్నికల అనంతరం లేబర్ కోడ్స్ అమలు కు నోటిఫికేషన్ విడుదల చేసింది.వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కాదా రాము ఆటో యూనియన్ ప్రతినిధులు బి దుర్గారావు, కుప్పిలి శ్రీనివాసరావు, ఎస్గురువులు,ప్రసాదు ఏంచిన్నారావు బి రాజు తదితరులు పాల్గొన్నారు.




