Cheepurupalli: చీపురుపల్లిలో చంద్రబాబు బర్త్‌డే జోష్!
Cheepurupalli: చీపురుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Cheepurupalli: చీపురుపల్లిలో చంద్రబాబు బర్త్‌డే జోష్!
Cheepurupalli: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చీపురుపల్లి నియోజకవర్గంలో యువనేత, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చీపురుపల్లి పట్టణం నుంచి శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ..
“4 దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న విజనరీ లీడర్ చంద్రబాబు గారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత, ఐటీ విప్లవానికి ఆద్యుడు ఆయన. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న దార్శనికుడు. రైతు బిడ్డగా, సామాన్యుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహానేత. స్వర్ణాంధ్ర - 2047 లక్ష్య సాధనకు ఆయన మార్గదర్శనం చాలా అవసరం” అని తెలిపారు.
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్‌లో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది పేదలు, ప్రజలు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




