Cheepurupalli: అన్నా క్యాంటీన్‌లో పేదలకు అన్నదానం.. పండుగలా సంబరాలు
Cheepurupalli: చీపురుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కళా వెంకటరావు ఘనంగా నిర్వహించారు.
Cheepurupalli: అన్నా క్యాంటీన్‌లో పేదలకు అన్నదానం.. పండుగలా సంబరాలు
Cheepurupalli: ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆధ్వర్యంలో చీపురుపల్లిలో ఘనంగా సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు - కనకమహాలక్ష్మి ఆలయం వరకు బైక్ ర్యాలీ, అన్నా క్యాంటీన్‌లో అన్నదానం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కళా వెంకటరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
చీపురుపల్లి పట్టణం నుంచి శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ..
“4 దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న విజనరీ లీడర్ చంద్రబాబు గారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత, ఐటీ విప్లవానికి ఆద్యుడు ఆయన. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్న దార్శనికుడు” అని తెలిపారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ..
“రైతు బిడ్డగా, సామాన్యుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహానేత చంద్రబాబు . స్వర్ణాంధ్ర - 2047 లక్ష్య సాధనకు ఆయన మార్గదర్శనం చాలా అవసరం. ఆయన బాటలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్‌లో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది పేదలు, ప్రజలు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




