Parvathipuram: ఘనంగా ప్రారంభమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య ఉద్యమం

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పారిశుద్ధ్య ఉద్యమాన్ని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ప్రారంభించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 23 May 2026 12:50 PM IST
Parvathipuram
X

Parvathipuram: ఘనంగా ప్రారంభమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య ఉద్యమం

​పార్వతీపురం: ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పారిశుద్ధ్య ఉద్యమ విజయానికి ప్రజా భాగస్వామ్యమే ముఖ్యం ఆని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం వై కె ఎం కాలనీ దరి "వన్ స్టేట్.. వన్ క్లీన్ మిషన్" అనే నినాదంతో ఘనంగా ప్రారంభమైంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ ప్రత్యేక పారిశుద్ధ్య ఉద్యమాన్ని పార్వతీపురంలో మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి స్వయంగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.మే 23 నుండి జూన్ 20, వరకు నెల రోజుల పాటు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ డ్రైవ్ నిరంతరాయంగాకొనసాగనుందన్నారు.​ఈ వారం ప్రత్యేకంగా 'విజిబుల్ క్లీన్‌లినెస్' (కంటికి కనిపించే పరిశుభ్రత) అనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను, వార్డుల ఎంట్రన్స్ పాయింట్ల వద్ద ఉండే వ్యర్థాలను పూర్తిగా తొలగించి, అక్కడ మళ్లీ చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ​ముఖ్యంగా పట్టణాల్లోని 'రెడ్ స్పాట్స్' (గోడలపై పాన్ మరకలు వంటివి), 'ఎల్లో స్పాట్స్' (బహిరంగ మూత్ర విసర్జన ప్రాంతాలు)లను గుర్తించి, వాటిని పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు.. అక్కడ మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను సూచించారు.

​ఈ పారిశుద్ధ్య డ్రైవ్‌లో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ డి. పావని, మున్సిపల్ కార్యాలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు మెప్మా అధికారులు, సిబ్బంది, స్థానిక మహిళా సంఘాల సభ్యులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రోడ్లను శుభ్రం చేశారు. ​మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయంతో ఈ నెల రోజుల పాటు పట్టణాల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్ కమిషనర్ డి. పావని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story