Palakonda: గట్టు మీద చెట్టు కార్యక్రమం.. మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్
Palakonda: పాలకొండ మండలం బుక్కురు గ్రామంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి 'గట్టు మీద చెట్టు' కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.
Palakonda: గట్టు మీద చెట్టు కార్యక్రమం.. మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్
పాలకొండ: రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పాలకొండ మండలంలోని బుక్కురు గ్రామంలో గట్టు మీద చెట్టు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ భూముల గట్లపై మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు నేల కోతను నివారించవచ్చని తెలిపారు.
రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మొక్కలు పెరిగే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అటవీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు కార్యక్రమాన్ని భాగస్వాములు కావాలని సూచించారు.
పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.




