Parvathipuram: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట: ప్రభుత్వ విప్!

Parvathipuram: సాకిగూడలో రూ. 60 లక్షల పీఎం జన్మన్ నిధులతో నిర్మించిన బహుళ ప్రయోజన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ప్రారంభించారు.

V.SESHU	, KURUPAM
Published on: 9 Aug 2026 6:16 PM IST
Parvathipuram
X

Parvathipuram: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట: ప్రభుత్వ విప్!

పార్వతీపురం, ఆగస్టు 9 : *గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా రూ. 60 లక్షల పీఎం జన్మన్ నిధులతో బహుళ ప్రయోజన కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజనుల సంక్షేమం, సంపూర్ణ వికాసమే లక్ష్యంగా ఆదివారం కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీలోని సాకిగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బహుళ ప్రయోజన కేంద్రంను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి వైభవంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ బహుళ ప్రయోజన కేంద్రం ద్వారా గిరిజన ప్రాంత పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం అత్యధునిక సదుపాయాలతో కూడిన డిజిటల్ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ మరియు శారీరక వికాసానికి ప్రాంగణంలో ప్రత్యేక ఆటల పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లలు వీటిపై ఆడుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా శారీరకంగా చాలా బలంగా తయారవుతారని సూచించారు. ఈ ప్రాంగణంలో పెద్దలు కూడా ఉపయోగించుకునే సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గతంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సాఖి గ్రామస్థులు నీలకంఠాపురం వరకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై ఆ అవసరం లేకుండా గ్రామంలోనే తక్షణ ప్రాథమిక వైద్య సదుపాయాలు అందేలా ఈ కేంద్రంలో ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ బహుళ ప్రయోజన కేంద్రాన్ని గిరిజన ప్రజలందరూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య, విద్యా సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం: ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశమని అన్నారు. నూతనంగా నిర్మించిన ఈ భవనం ఎంతో శుభ్రంగా, చక్కగా ఉందనడంలో సందేహం లేదని, ప్రతి ఒక్కరూ ఈ భవనాన్ని తమ సొంత ఇంటిలా భావించి, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కోరారు.

ఒకే ప్రాంగణంలో ప్రజలకు ఆరోగ్య సేవలు, చిన్న పిల్లలకు చదువుకునే వసతి లభించడం ఈ గ్రామ ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు లభించడం అరుదని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సంయుక్త సహకారంతో గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హెల్త్ సెంటర్ల నిర్మాణం, అభివృద్ధి జరుగుతోందని, ఈ సదుపాయాలన్నింటినీ గిరిజన ప్రజలు, గ్రామస్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఒ పి.మురళీధర్, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story