Parvathipuram: పాలకొండలో స్వయంగా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్!

Parvathipuram: బుక్కురు గ్రామంలో కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో అవ్వా-తాతలకు సామాజిక భద్రతా పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 1 July 2026 4:04 PM IST
Parvathipuram
X

Parvathipuram: పాలకొండలో స్వయంగా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్!

పార్వతీపురం, జులై 1: అవ్వా-తాతల కళ్ళల్లో ఆనందం చూడాలనే ద్యేయంతో ప్రభుత్వం పని చేస్తోందని జిల్లా కలెక్టర్ డా:ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. బుధవారం పాలకొండ మండలం, బుక్కురు గ్రామంలో ఏర్పాటు చేసిన

పెన్షన్ పంపిణి కార్యక్రమలో జిల్లా కలెక్టర్ పాల్గొని స్వయంగా పెన్షన్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి వృద్ధాప్య పెన్షన్ సకాలంలో అందిస్తున్నామని పేర్కొన్నారు.

వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పెన్షన్ పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని అధికారులకు సూచించారు.

వృద్ధుల సమస్యలను జిల్లా కలెక్టర్ స్వయంగా అడిగి అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, డిఆర్డిఎ పిడి ప్రభావతి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story