Parvathipuram: కొమరాడలో కలెక్టర్ సర్ప్రైజ్ విజిట్.. ఓటర్ సర్వే పరిశీలన
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి కొమరాడ మండల కేంద్రంలో పర్యటించారు.
Parvathipuram: కొమరాడలో కలెక్టర్ సర్ప్రైజ్ విజిట్.. ఓటర్ సర్వే పరిశీలన
కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి శుక్రవారం తన పర్యటనలో భాగంగా కొమరాడ మండల కేంద్రంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్ల పనితీరును పరిశీలించిన కలెక్టర్, ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు.
ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి, అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడంతో పాటు, వివరాలను క్షుణ్ణంగా ధృవీకరించాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీలో రెవెన్యూ డివిజినల్ అధికారి కె. మాధురి, సంబంధిత ఎన్నికల అధికారులు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




