Parvathipuram: పెదపెంకిని రాష్ట్రంలోనే మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలి

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Updated on: 6 Jun 2026 2:17 PM IST
Parvathipuram
X

Parvathipuram: పెదపెంకిని రాష్ట్రంలోనే మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలి

పార్వతీపురం: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, ఇప్పటికే పురోగతిలో ఉన్న పనులను ఈ నెల 20 నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

గ్రామంలో ఫైలేరియా నియంత్రణకు ఇంతవరకు కృషిచేసిన అధికారులను కలెక్టర్ ఈ సందర్బంగా అభినందించారు. ఈ నెలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ విలేజ్‌గా డిప్యూటీ సీఎం గారు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో చేపట్టవలసిన పనులన్నీ త్వరగా పూర్తి చేసి 'ట్రయల్ రన్' నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలోని పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రత్యేకించి మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య సేవలకు సంబంధించిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల నాణ్యతను పరిశీలించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాన్ని ముస్తాబు గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు.

ఈ సమావేశంలో ఐటీడిఎ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా, ఐసీడిఎస్ పీడీలు కె.రామచంద్రరావు, టి. కనకదుర్గ, డీఎంహెచ్ఓ డా. ఎస్.భాస్కరరావు, విద్య, ఉద్యానవన, ఇతర సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story