Bhogapuram: అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం!

Bhogapuram: పార్వతీపురంలో లైవ్ టెలికాస్ట్ కోసం డిజిటల్ ఎల్‌ఈడీ డిస్ప్లేలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 25 July 2026 10:31 PM IST
Bhogapuram
X

Bhogapuram: అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం!

భోగాపురం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటనకు సంబంధించిన సమయాన్ని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలకు విస్తృతంగా చేరవేసేందుకు, ప్రత్యక్షం తిలకించేందుకు పార్వతీపురం ఆర్టిసి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఆర్ సి యం స్కూల్ బైట డిజిటల్ ఎల్‌ఈడీ డిస్ప్లే ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా: ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే అత్యంత ఆధునీకరణతో, సువిశాలమైన విమానాశ్రయం ఉత్తరాంధ్రలో నెలకొల్పడం ఒక చరిత్రని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

ఈ డిజిటల్ డిస్ప్లేలో ప్రధానమంత్రి పర్యటన సమయం, ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు, ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన సమాచారం నిరంతరం ప్రదర్శించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సమాచారాన్ని తెలుసుకొని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనే చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించాలని కలెక్టర్ కోరారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశను నిర్దేశించే కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించడం, ప్రధానమంత్రి పర్యటన సమయాన్ని సకాలంలో తెలియజేయడమే లక్ష్యంగా జిల్లాలో డిజిటల్ డిస్ప్లేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జిల్లా ప్రజలందరూ డిజిటల్ డిస్ప్లేలో ప్రసారమయ్యే సమాచారాన్ని గమనించి, కార్యక్రమాన్ని వీక్షించి ఈ చారిత్రాత్మక సందర్భంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story