Vizianagaram: ప్రధాని పర్యటనలో ఎటువంటి లోపాలు ఉండకూడదు కలెక్టర్ ఆదేశం!

Vizianagaram: భోగాపురంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 21 July 2026 8:25 PM IST
Vizianagaram
X

Vizianagaram: ప్రధాని పర్యటనలో ఎటువంటి లోపాలు ఉండకూడదు కలెక్టర్ ఆదేశం!

విజయనగరం: భోగాపురం ప్రధాన మంత్రి పర్యటన రూట్ మ్యాప్, సభాస్థలం వివరాలు, పార్కింగ్ ప్రదేశాలు రూట్ మ్యాపు, పబ్లిక్ హోల్డింగ్ పాయింట్ లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవెంట్ మానేజ్మెంట్ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి వివరించి తగు సూచనలు చేసారు. జి ఎంఆర్ విమానాశ్రయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో పాల్గొని తగు సూచనలు చేసారు.

వి ఐ పి లు పార్కింగ్ స్థలం నుండి వేదికకు వచ్చే మార్గంలో రెండంచెల బారికేడ్లు అమర్చాలని జిఎంఆర్ ప్రతినిధులకు సూచించారు. ప్రధాని కి స్వాగత కార్యక్రమం లో పాల్గొనే కళాకారులకు విద్యార్థులకు తాగునీరు, అల్పాహారం ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. సభకు హాజరయ్యే వారికి సెక్టార్ల వారి రంగులతో కూడిన గుర్తింపు కార్డులు తయారు చేయవలసిందిగా ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశం నుండి సభాస్థలి వరకు ప్రజలు హాజరయ్యేందుకు నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయవలసిందిగా అడిషనల్ ఎస్ పి కు ఆదేశించారు.

ఈ సమావేశం లో జిఎంఆర్ ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ సేదుమాధవన్, జి సి సి ఎం డి శోభిత అడిషనల్ ఎస్ పి సౌమ్య లత, ఈవెంట్ మానేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story