Palakonda: పాలకొండ తహశీల్దార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Palakonda: పాలకొండ మండల తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆకస్మిక తనిఖీలు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 25 April 2026 9:01 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండ తహశీల్దార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Palakonda: పాలకొండ మండల కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చూడాలని తహశీల్దార్, ఇతర సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. శుక్రవారం స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయంలోని హాజరు పట్టికతో పాటు భూమి రికార్డులు, రీ-సర్వే పురోగతి, పెండింగ్లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఆన్లైన్ సేవల పనితీరును మెరుగుపర్చాలని, డేటా ఎంట్రీ ప్రక్రియలో ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలని కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. ఈ తనిఖీలో తహవీల్దార్ తో పాటు కార్యాలయ రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story