Bobbili: బొబ్బిలి జూట్ మిల్ భూముల కబ్జాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి!

Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్ భూముల ఆక్రమణపై సీపీఐ నాయకుల నిరసన. తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 1 Oct 2026 1:53 PM IST
Bobbili
X

Bobbili: బొబ్బిలి జూట్ మిల్ భూముల కబ్జాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి!

Bobbili: బొబ్బిలి పట్టణంలో ఉన్నటువంటి వివాదాస్పదమైన శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్ భూముల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించి జూట్ మిల్ మధ్యలో ప్రహరీ గోడ నిర్మించిన ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు తక్షణమే నమోదు చేసి. అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి తక్షణమే తొలగించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ సుబ్బారావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న. సిపిఐ పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం పై ఉందని. గతంలో జూట్ మిల్ భూమిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గతంలో చేసినటువంటి పోరాటాల్ని సందర్భంగా గుర్తు చేశారు.

జూట్ మిల్ భూమిని కొనటువంటి కొంతమంది వ్యక్తులు తప్పుడు పద్ధతుల్లో అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తామని అనుకుంటే సిపిఐ పార్టీ గా చూస్తూ ఊరుకోబోమని అదే జూట్ మిల్ స్థలంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం వలన కోట్లాది రూపాయి విలువచేసే ప్రభుత్వ భూములు.

చెరువులు రియల్ ఎస్టేట్ మరియు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయని. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం స్పందించి ఏదైతే కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములుకు రక్షణ కల్పించి వాటిని కాపాడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సిహెచ్ రాజు. జి సత్యనారాయణ పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI