Komarada: కొమరాడలో రైతుల ఆందోళన.. సబ్సిడీ విత్తనాల కోసం సీపీఎం పోరు!

Komarada: కొమరాడలో వరి విత్తనాల కోసం రైతుల నిరసన. ఎకరాకు సరిపడా సబ్సిడీ విత్తనాలు అందజేయాలని సీపీఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి డిమాండ్.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 8 Jun 2026 9:45 AM IST
Komarada
X

Komarada: కొమరాడలో రైతుల ఆందోళన.. సబ్సిడీ విత్తనాల కోసం సీపీఎం పోరు!

కొమరాడ: కొమరాడ మండల కేంద్రంలో మరడానవీధిలో ఈరోజు అనగా సోమవారం రైతులతో కలిసి సిపిఎం పార్టీగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుత రోజులు గడుస్తున్న ఈరోజు కి రైతులు పొలాలకు అదును రావడంతో రైతు ఈ సేవ కేంద్రాల ద్వారా వివిధ రకాల వరి విత్తనాలు సబ్సిడీ రూపంలో ఎప్పుడు ఇస్తా రో అంటూ ఎదురుచూసే పరిస్థితి ఉంది.

ఇలాంటి సందర్భంలో వెంటనే రైతులకు అవసరం మేరకు వరి విత్తనాలు రైతు ఈ సేవ కేంద్రాల ద్వారా అందజేసి రైతులకు భరోసా కల్పించాలనికోరుతున్నాంఎందువల్ల అంటే ఎకరా భూమి ఉన్న రెండు ఎకరాలు ఉన్న మూడు ఎకరాలు ఉన్న నాలుగు ఎకరాలు భూమి ఉన్న ఒక రైతుకి రెండు వరి విత్తనాలు బస్తాలు 33% సబ్సిడీ రూపంలో ఇస్తామనడం చాలా అన్యాయమని ఎందుకంటే ఏజెన్సీ మండలం కాబట్టి 90 శాతం వరకు అన్ని వర్గాల రైతులకు సబ్సిడీ రూపంలో ఎంత అవసరమో అంతవరకు వరి విత్తనాలు వెంటనే సప్లై చేసి ఆదుకోవాలని కోరుతున్నాం.

ఎందుకంటే రైతుకి సరిపడినంత వరి విత్తనాలు ఇవ్వకపోవడంతో మన గోమూరు సెంటర్ కి మరియు ప్రైవేటు వ్యక్తుల షాపుల వద్దకు వెళ్లి అధిగ రేట్లు కు వరి విత్తనాలు కొనుక్కోవడం వల్ల రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుందని కాబట్టి రైతుకి వరి విత్తనాలు ఎంత అవసరమో ఆ విధంగాగుర్తించి ప్రతి రైతుకి సరిపడినంత వరి విత్తనాలు ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా భరోసాకల్పించాలని సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా కాకుండా ఒకటి రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే భవిష్యత్తులో రైతు ఈ సేవ కేంద్రాల వద్ద రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతాము.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story