Palnadu: ఎస్సీ హోదానే లక్ష్యం: దాచేపల్లి రౌండ్ టేబుల్‌లో రజకుల గర్జన!

Palnadu: పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకుల ఐక్యతా రౌండ్ టేబుల్ సమావేశం-2 అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 25 May 2026 11:02 AM IST
Palnadu
X

Palnadu: ఎస్సీ హోదానే లక్ష్యం: దాచేపల్లి రౌండ్ టేబుల్‌లో రజకుల గర్జన!

పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలంలో జరిగిన రజకుల చిరకాల డిమాండ్ అయిన ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఏకైక ఎజెండాతో రాష్ట్రవ్యాప్త రజక నేతలు దాచేపల్లిలో గర్జించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకుల ఐక్యతా రౌండ్ టేబుల్ సమావేశం-2 ఆదివారం వందలాది మంది రజక ప్రతినిధుల సమక్షంలో జరిగింది.

తంగేటి భాస్కర్ రావు గర్జన

ఈ సమావేశంలో విజయనగరం జిల్లా రజక సంఘం అధ్యక్షుడు తంగేటి భాస్కర్ రావు మాట్లాడుతూ.. "రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల జనాభా ఉన్న రజకులను ఏ ప్రభుత్వమైనా నిర్లక్ష్యం చేస్తోంది. మన గర్జనతో ప్రభుత్వాలు కదలాలి. ఎస్సీ హోదా సాధనే మన ఏకైక లక్ష్యం" అని స్పష్టం చేశారు.

"30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఒకే ఎజెండాతో పోరాడి సాధించిన మందకృష్ణ మాదిగ గారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. పార్టీలకు అతీతంగా ఎంతదాకైనా వెళ్లి సమస్య సాధిస్తాం" అని భాస్కర్ రావు పిలుపునిచ్చారు.

విజయనగరం నుండి భారీగా హాజరు

విజయనగరం జిల్లా నుండి అధ్యక్షుడు తంగేటి భాస్కర్ రావు ఆధ్వర్యంలో సింహాచలం, టీ.చల్ల రావు, తామాడ శ్రీను, కోనాడ సతీ కుమార్ మరియు పొన్నాడ దేవుడు మొదలగు నాయకులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు.

ప్రధాన తీర్మానాలు:

1. UP, బీహార్, ఢిల్లీ తరహాలో APలోనూ రజకులను SC జాబితాలో చేర్చాలి

2. రజకుల పోరాటానికి MRPS నేత మందకృష్ణ మాదిగ పూర్తి మద్దతు ఉంది

3. BC-Aలో అతిపెద్ద కులంగా ఉన్నా సామాజికంగా వెనుకబడే ఉన్నాం

రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన రజక నేతలు "ఎస్సీ హోదా వచ్చే వరకు విశ్రమించేది లేదు" అని ముక్తకంఠంతో నినదించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story