Vizianagaram: ఎంపీ భరత్ బర్త్‌డే వేడుకలు.. రోగులకు పండ్ల పంపిణీ!
Vizianagaram: శృంగవరపుకోటలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప క్రిష్ణ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయంలో పూజలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.
Vizianagaram: ఎంపీ భరత్ బర్త్‌డే వేడుకలు.. రోగులకు పండ్ల పంపిణీ!
విజయనగరం: విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ గొంప క్రిష్ణ గారి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ముందుగా శ్రీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భరత్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ గొంప క్రిష్ణ గారి కార్యాలయంలో కేక్ కట్ చేసి శ్రీ భరత్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ భరత్ గారి ప్రజాసేవా దృక్పథాన్ని కొనియాడారు.
తదుపరి శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 200 మంది రోగులకు బ్రెడ్ మరియు పండ్లను పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తామని డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ గొంప క్రిష్ణ తెలిపారు.




