Parvathipuram: పవన్ కళ్యాణ్ పర్యటనకు సర్వం సిద్ధం. అభివృద్ధిపై నివేదిక

Parvathipuram: పెదపెంకి గ్రామానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూటమి

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 1 July 2026 4:43 PM IST
Parvathipuram
X

Parvathipuram: పవన్ కళ్యాణ్ పర్యటనకు సర్వం సిద్ధం. అభివృద్ధిపై నివేదిక

పార్వతీపురం: బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి జూలై 6న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్న సందర్భంగా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.

ఈ పర్యటన నియోజకవర్గ అభివృద్ధికి ఒక మంచి అవకాశమని పేర్కొన్న ఎమ్మెల్యే, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు, దీర్ఘకాలిక అవసరాలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాలపై సమగ్ర ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అందజేయనున్నట్లు వెల్లడించారు.

పర్యటన ద్వారా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అభివృద్ధి పనులకు వేగం తీసుకురావడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలకాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు.

అలాగే, పర్యటన ఏర్పాట్లు, రూట్ మ్యాప్ మరియు ఇతర కార్యక్రమాలపై త్వరలోనే పెదపెంకి గ్రామంలో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story