Kurupam: కురుపాంలో వైభవంగా శ్రీ పైడిమారమ్మ అమ్మవారికి శ్రావణ సారె!

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పైడిమారమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా శ్రావణ సారె సమర్పించారు.

V.SESHU	, KURUPAM
Published on: 23 Aug 2026 3:42 PM IST
Kurupam
X

Kurupam: కురుపాంలో వైభవంగా శ్రీ పైడిమారమ్మ అమ్మవారికి శ్రావణ సారె!

కురుపాం: శ్రావణ మాసం సందర్భంగా కురుపాం గ్రామ ప్రజల ఇలవేల్పు, ఆరాధ్య దైవం శ్రీ పైడిమారమ్మ అమ్మవారికి ఆదివారం గ్రామస్తులు ఘనంగా శ్రావణ సారె సమర్పించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ధూళికేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన సారె ఊరేగింపు మేళతాళాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల గుండా సాగింది. మహిళలు 108 రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ, చీరలు, పండ్లు తదితర మంగళ ద్రవ్యాలతో సారెను సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించారు.

అమ్మవారి అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలను గ్రామంలోని అన్ని వార్డుల ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అమ్మవారికి కొత్తకోట రవీంద్ర కుమార్, సురేష్ కుమార్ ప్రత్యేకంగా సారె ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, బుజ్జి, వంశీ, శ్రవణ్, ఆలయ సేవకులు నారాయణరావు, చక్రధర్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story