Garugubilli: గరుగుబిల్లిలో డిజిటల్ అవగాహన సదస్సు

Garugubilli: స్మార్ట్‌ఫోన్ అధిక వినియోగం, సైబర్ భద్రతపై జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ అవగాహన. స్క్రీన్ టైమ్ నియంత్రణే లక్ష్యం.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 2 Jun 2026 5:29 PM IST
Garugubilli
X

Garugubilli: గరుగుబిల్లిలో డిజిటల్ అవగాహన సదస్సు

గరుగుబిల్లి: పార్వతీపురం మన్యం జిల్లా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్ది గారి ఆదేశాల మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి టి. కనకదుర్గ ఆధ్వర్యంలో గరుగుబిల్లి మండలం, సంతోషిపురం గ్రామంలో “డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం – జాగ్రత్తలు మరియు బాధ్యతలు-” అనే అంశంపై కిశోర బాలికలతో ముఖాముఖి సంభాషణ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ మాట్లాడుతూ, యుక్తవయస్కులకు స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు స్క్రీన్ టైమ్ నియంత్రణపై అవగాహన కల్పించారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్‌లను అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించాలని, అధిక స్క్రీన్ టైమ్ కారణంగా కంటి సమస్యలు, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, చదువుపై ఆసక్తి తగ్గడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు మరియు యుక్తవయస్కులు సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కాకుండా తమ సమయాన్ని చదువు, క్రీడలు మరియు సృజనాత్మక కార్యక్రమాలకు కేటాయించాలని సూచించారు.

అలాగే సైబర్ భద్రత, వ్యక్తిగత సమాచార పరిరక్షణ, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించి, ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తవిటి నాయుడు, శిశుగృహ సోషల్ వర్కర్ రమ్య, అంగన్వాడి టీచర్స్ మరియు కిశోర బాలికలు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story