Vizianagaram: విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా పోలీసు సంస్మరణ దినం!

Vizianagaram: విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ నివాళులర్పించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 21 Oct 2026 11:37 AM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా పోలీసు సంస్మరణ దినం!

Vizianagaram: దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత కొనియాడారు. వారి కుటుంబాలకు న్యాయ వ్యవస్థ అండగా ఉంటుందని చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఘనంగా నివాళి అర్పించారు.

​ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. అమర వీరుల త్యాగాలను కొనియాడారు. అమరవీరులకు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు.

జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ రేపటి మన భవిషత్తు కోసం, అమరవీరులు చేసిన త్యాగం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ ఏడాది దేశంలో ప్రాణ త్యాగాలు చేసిన154 మంది పోలీసు అమరవీరుల్లో, జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారని ఎస్పీ తెలిపారు.

ఎన్.సి.సి. వింగ్ కమాండర్, లెఫ్టినెంట్ కల్నల్ రవి వ్యాస్, కోరుకొండ సైనిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఎస్.కిరణ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొని, ముఖ్య అతిథులతో పాటు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2025 నుంచి ఆగస్ట్ 2026 మధ్య కాలంలో కర్తవ్య నిర్వహణలో అశువులు బాసిన 154 మంది పోలీసు వీరుల త్యాగాలను, వారి పేర్లను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

​ఈ కార్యక్రమంలో పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందిన సిహెచ్. విశాలాక్షి (భర్త లేటు చిరంజీవి), షేక్ బీబీ జాన్ (భర్త లేటు షేక్ ఇస్మాయిల్)లను ఘనంగా సత్కరించి, వారి త్యాగాలను గౌరవించారు. ఎఆర్ అడిషనల్ ఎస్పీ పి. కిరణ్ కుమార్, విజయనగరం డీఎస్పీ ఎస్. లక్ష్మణమూర్తితో పాటు పలువురు సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.