Cheepurupalli: చీపురుపల్లి, శ్రీకాకుళంలో డాక్టర్ బొత్స అనూష పర్యటన

Cheepurupalli: చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం మరియు శ్రీకాకుళంలో జరిగిన పలు వివాహ వేడుకలకు డాక్టర్ బొత్స అనూష హాజరయ్యారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 3 May 2026 8:25 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: చీపురుపల్లి, శ్రీకాకుళంలో డాక్టర్ బొత్స అనూష పర్యటన

Cheepurupalli: చీపురుపల్లి నియోజకవర్గం మరియు శ్రీకాకుళంలో ఈరోజు ఆదివారం జరిగిన పలు శుభకార్యాల్లో డాక్టర్ బొత్స అనూష పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

గుర్ల మండలం, పెదమజ్జిపేట:

శ్రీ పెదమజ్జి రాము, శ్రీమతి సీతామహాలక్ష్మి దంపతుల ప్రథమ పుత్రుడు చి. వెంకటేష్ వివాహ వేడుకలో డాక్టర్ బొత్స అనూష పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

గుర్ల మండలం, కెల్ల:

శ్రీ కెల్ల రామునాయుడు, శ్రీమతి సావిత్రి గారి ఏకైక పుత్రిక చి.ల.సా. ఇందుమతి వివాహ మహోత్సవంలో డాక్టర్ బొత్స అనూష హాజరై నూతన జంటకు ఆశీస్సులు అందించారు.

పై రెండు కార్యక్రమాల్లో *డాక్టర్ బొత్స అనూష*తో పాటు జడ్పీటీసీ శిర అప్పలనాయుడు, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు బెల్లాన బంగారు నాయుడు, రాష్ట్ర ఆర్టిఐ వింగ్ కార్యదర్శి కెంగువ మధుసూదన్ రావు, మంత్రి వెంకటరమణ, చింతలపేట మాజీ సర్పంచ్ భాస్కరరావు, సన్యాసి నాయుడు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాకుళం - ఆనందమయి కన్వెన్షన్ హాల్:

శ్రీ సిమ్మ రాజశేఖర్ కుమారుడి వివాహ వేడుకలో డాక్టర్ బొత్స అనూష పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, అందవరపు సూరిబాబు, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story