Parvathipuram: సైకిల్ ర్యాలీ 3R విధానంతో ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం

Parvathipuram: కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డిలతోకలిసి స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Updated on: 16 May 2026 2:52 PM IST
Parvathipuram
X

Parvathipuram: సైకిల్ ర్యాలీ 3R విధానంతో ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం

పార్వతీపురం: పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం పార్వతీపురంలోని మున్సిపల్ పార్క్, శివాలయం వీధి చెరువు పరిసరాల్లో నిర్వహించిన “స్వచ్ఛ భారత్ – స్వర్ణ భారత్” కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్’ సైకిల్ ర్యాలీలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత నగరాలు – ప్లాస్టిక్ రహిత పల్లెలు అనే నినాదంతో పాటు వ్యర్థాల నిర్వహణలో 3ఆర్ విధానం (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) అమలు చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.

గతంలో అడవిలా మారి ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిన స్థానిక చెరువు పరిసర ప్రాంతాన్ని పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వాడేసి పారేసిన వస్తువులను వినియోగించి ఆ ప్రాంతాన్ని అందమైన పార్కుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యువత కోసం సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

పట్టణానికి అవసరమైన మొక్కలను ఇక్కడే పెంచేలా చెరువు పరిసరాలను నర్సరీగా అభివృద్ధి చేయనున్నామని, చెరువులోని నీటిని శుద్ధి చేసి తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా చేయడమే లక్ష్యమన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా వాటిలో చిన్న మొక్కలు పెంచాలని సూచించారు. చెత్తను రోడ్లపై వేయకుండా తప్పనిసరిగా డస్ట్‌బిన్లలోనే వేయాలని ప్రజలను కోరారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story