Parvathipuram: సచివాలయంలో కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆకస్మిక తనిఖీ కీలక ఆదేశాలు!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి జీఎం వలస మండలం బీజే పురం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Parvathipuram: సచివాలయంలో కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆకస్మిక తనిఖీ కీలక ఆదేశాలు!
పార్వతీపురం: ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. శనివారం తన పర్యటనలో భాగంగా జి.ఎం. వలస మండలంలోని బి.జే. పురం గ్రామపంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచనలు చేశారు.
అలాగే గ్రామ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలన్నారు. ఈ పర్యటనలో రెవిన్యూ, సచివాలయ అధికారులు సిబ్బంది ఉన్నారు.




