Parvathipuram: సూడిగమం వృద్ధుని దరఖాస్తుపై డీఆర్ఓ హేమలత తక్షణ యాక్షన్!
Parvathipuram: మన్యం జిల్లా పీజీఆర్ఎస్ లో కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు సూడిగమం వృద్ధునికి డీఆర్ఓ కె. హేమలత వినికిడి పరికరాన్ని తక్షణమే అందజేశారు.
Parvathipuram: సూడిగమం వృద్ధుని దరఖాస్తుపై డీఆర్ఓ హేమలత తక్షణ యాక్షన్!
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారి ఆదేశాల మేరకు వినికిడి లోపంతో బాధపడుతున్న ఒక వృద్ధుని దరఖాస్తుపై జిల్లా యంత్రాంగం మానవత్వంతో తక్షణమే స్పందించి సహాయం అందించింది.
వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మండలం, సూడిగమం గ్రామానికి చెందిన పాతూరు జగన్నాథం అనే వృద్ధుడు తీవ్రమైన వినికిడి లోపంతో బాధపడుతున్నారు. తనకు ఒక వినికిడి యంత్రం మంజూరు చేయాల్సిందిగా కోరుతూ వైద్య నివేదికలతో సహా సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించారు.ఈ దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత గారు తక్షణమే స్పందించారు.
వృద్ధుని పరిస్థితిని మరియు ఆడియాలజిస్ట్ అందించిన వైద్య నివేదికను పరిశీలించిన DRO, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి తక్షణమే వినికిడి పరికరాన్ని మంజూరు చేయించారు.అనంతరం, కలెక్టరేట్ హాల్‌లోనే లబ్ధిదారుడైన పాతూరు జగన్నాథానికి జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత గారి చేతుల మీదుగా వినికిడి పరికరాన్ని అందజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ తక్షణమే న్యాయం జరిగేలా మరియు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని.
ఈ సందర్భంగా డి.ఆర్.ఓ తెలిపారు.అర్జీ పెట్టుకున్న కొద్ది సమయంలోనే స్పందించి వినికిడి పరికరాన్ని అందజేయడం పట్ల వృద్ధుడు పాతూరు జగన్నాథం మరియు ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారికి, జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.




