Parvathipuram: రైళ్లలో 'ఈగల్ సెల్' మెరుపు దాడులు.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ సెల్, పోలీసులు రైళ్లలో సంయుక్త తనిఖీలు చేపట్టారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 20 Jun 2026 11:28 AM IST
Parvathipuram
X

Parvathipuram: రైళ్లలో 'ఈగల్ సెల్' మెరుపు దాడులు.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట!

పార్వతీపురం: మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ సెల్ శనివారం రైళ్లలో సంయుక్త తనిఖీలు నిర్వహించింది. ఐజీపీ (ఈగల్) ఏ.కే. రవికృష్ణ, ఐపీఎస్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎన్. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఈగల్ సెల్ ఎస్‌ఐ, కొమరాడ పోలీసు సిబ్బంది, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ బృందాలు పాల్గొన్నాయి.

భవానీపట్నం–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు (నెం. 58503)లో పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్ వరకు ప్రయాణిస్తూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రైలులోని బోగీలు, ప్రయాణికుల సామగ్రిని పరిశీలించినప్పటికీ ఎలాంటి మత్తు పదార్థాలు గుర్తించలేదని అధికారులు తెలిపారు.

మత్తు పదార్థాల రవాణా, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాలో రైళ్లు, బస్సులు తదితర ప్రజా రవాణా మార్గాల్లో ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఈగల్ సెల్ అధికారులు వెల్లడించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story