Kurupam: కురుపాంలో అక్రమ మద్యం విక్రయాలు.. ఒకరి అరెస్ట్!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠపురంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు.
Kurupam: కురుపాంలో అక్రమ మద్యం విక్రయాలు.. ఒకరి అరెస్ట్!
కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠపురం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఆరిక ఆనందరావును అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమంగా నాటు సారాయి తయారీ, మద్యం విక్రయాలు, గొలుసు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్‌ఐ జె. రాజశేఖర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




