Gurla: భూ సమస్యలపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావును కలిసిన రైతులు
Gurla: రాజాంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావును కలిసి భూ సమస్యలపై వినతిపత్రం అందజేసిన గుర్ల మండలం పాలవలస రైతులు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.
Gurla: భూ సమస్యలపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావును కలిసిన రైతులు
గుర్ల: గుర్ల మండలం పాలవలస గ్రామానికి చెందిన రైతులు రాజాంలో ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారిని కలిసి తమ భూ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
T.D. No.459 పరిధిలోని ఇనాం భూములను తాము గత 45 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు తెలిపారు. 1988లో తమకు రైత్వారీ పట్టాలు మంజూరైనప్పటికీ, ప్రస్తుతం ఆ భూములు ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లపై నమోదు కాకపోవడం వల్ల పంట రుణాలు, పంట నష్టపరిహారం, రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్యను పరిశీలించి, భూములను ఆన్‌లైన్ రికార్డుల్లో సంబంధిత రైతుల పేర్లపై నమోదు చేయించి, శాశ్వత హక్కు పట్టాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు, రైతుల సమస్యను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.




