Parvathipuram: శ్రీసిరి స్కూల్‌లో ఫైర్ సేఫ్టీపై అవగాహన సదస్సు!

Parvathipuram: పాలకొండ శ్రీ సిరి స్కూల్‌లో పాలకొండ ఫైర్ ఆఫీసర్ జమి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 11 Aug 2026 8:50 AM IST
Parvathipuram
X

Parvathipuram: శ్రీసిరి స్కూల్‌లో ఫైర్ సేఫ్టీపై అవగాహన సదస్సు!

Parvathipuram: నిత్యజీవితంలో ప్రమాదాలకు దూరంగా ఉంటూ జీవనం సాఫీగా, కుటుంబానికి, సమాజానికి శ్రేయస్కరమైన వ్యక్తులుగా విద్యార్థి దశలో అభ్యాసన జరిపి ఎదగాలని పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు శ్రీ సిరి స్కూల్, పాలకొండ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఏదేని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కోవాలి లేక ప్రమాదం నుండి తప్పించుకోవాలి. ఈ రెండింటి పైన విద్యార్థులకు అవగాహన కల్పించడమైనది.

ఈ సందర్భముగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ నిర్వహణ, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లీక్ జరిగి ఇంకా మంటలు ఏర్పడని సందర్భములో తీసుకోవలసిన జాగ్రత్తలు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లీక్ జరిగి మంటలు ఏర్పడినప్పుడు ఆ మంటలను నివారించే పద్ధతి పైన అవగాహన కల్పించారు.ఏసంస్థలోనైనా తరలింపు టీములను ఏర్పాటు చేసుకొని ఏదేని ప్రమాదం జరిగినప్పుడు ఎలా తరలింపు చర్యలు చేపట్టాలి అనే తర్ఫీదు కలిగి ఉండాలని సూచించారు.ఈ

కార్యక్రమములో పాలకొండ అగ్నిమాపక సిబ్బంది మరియు శ్రీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story