Parvathipuram: పార్వతీపురం ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
Parvathipuram: పార్వతీపురంలో వైఎస్సార్ జయంతి వేడుకలు. విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
Parvathipuram: పార్వతీపురం ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ అలజంగి జోగారావు గారి సారధ్యంలో వైసిపి శ్రేణుల సమక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైయస్ఆర్ కూడలి వద్ద మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే , నాయకులు క్షీరాభిషేకం, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పేదలకు పళ్ళు, సీట్లు పంపిణీ చేశారు. అలానే పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు గారు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజల హృదయాల్లో ఆయనను శాశ్వతంగా నిలిపాయి. ఆయన ఆశయాల సాధనకు, పేదల సంక్షేమానికి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు. వైయస్సార్ చారిత్రాత్మక పాదయాత్ర 2003లో చేపట్టిన 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర (సుమారు 1470 కిలోమీటర్లు) ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసింది అన్నారు.
2004 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా సేవలందించి ప్రసిద్ధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కొన్ని విప్లవాత్మక పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయి అన్నారు.
ఉచిత విద్యుత్: రైతులకు వ్యవసాయం కోసం ఉచిత కరెంట్ సరఫరా ఆరోగ్యశ్రీ: పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు
ఫీజు రీయింబర్స్‌మెంట్: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజుల చెల్లింపు.
అంబులెన్స్: అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత వాహన సౌకర్యం 108, 104 వంటి గొప్ప పథకాలు అమలు చేసి ప్రతీ ఒక్కరి గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోయారు అన్నారు.
నాడు వైయస్సార్ ఆశయ సాధన కొరకు ఏర్పడిన వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వైసిపి ప్రభుత్వం పాలనలో ప్రజలకు గొప్ప పాలనను అందించి తండ్రికి మించి అనేక గొప్ప సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసి రాష్ట్ర ప్రజలను బాగా చూసుకుంటే నేడు అంతకు మించి హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో హామీలు అమలు చేయకపోగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ..
ప్రతిపక్ష నాయకులపై, ప్రజలపై అక్రమ కేసులు పెడుతూ, వేధిస్తూ, హింసను ప్రేరేపిస్తూ రాష్ట్రంలో జంగిల్ రాజ్య పాలనను కొనసాగిస్తూ, డైవర్షన్ పాలనతో ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా వంచించి మోసం చేస్తుంది అని దుయ్యబట్టారు. ఇంకెన్నాళ్లో ఈ కూటమి ప్రభుత్వం ఆటలు సాగవు అని, 2029 తర్వాత కూటమి భూస్థాపితం కాక తప్పదు అని తెలిపారు.




