Parvathipuram: ఎంపీటీసీ రామారావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే!

Parvathipuram: పార్వతీపురం మండలం ఎం ఆర్ నగరం ఎంపీటీసీ బడే రామారావు తండ్రి బలరాం నాయుడు మృతి. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 18 Aug 2026 1:39 PM IST
Parvathipuram
X

Parvathipuram: ఎంపీటీసీ రామారావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే!

Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మండలం ఎం ఆర్ నగరం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు, స్థానిక ఎంపిటిసి సభ్యులు బడే రామారావు తండ్రి బడే బలరాం నాయుడు అనారోగ్య కారణంగా గత ఆదివారం రాత్రి స్వర్గస్థులు అయిన విచారక విషయం తెలుసుకున్న పార్టీ సమన్వయకర్త, స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ అలజంగి జోగారావు గారు చింతిస్తూ దివంగత బలర్రాం నాయుడు అంత్యక్రియలకు అనివార్య పరిస్థులు మూలంగా రాలేకపోయిన ఆయన మంగళవారం మండల నాయకులతో కలిసి ఎంపీటీసీ రామారావు గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నాయుడు గారి ఆకస్మిక మరణానికి గల కారణాలు తెలుసుకుని ఎంపీటీసీ నీ ఓదార్చి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, వైఎస్ ఎంపీపీ బంకురీ రవికుమార్, సీనియర్ నాయకులు బలగ నాగేశ్వరరావు, వేంపలి గురురాజు, తాన్న శ్రీరాములు నాయుడు, మండల త్రినాథ, మండల యూత్ అధ్యక్షులు ఉరిటి అప్పల నాయుడు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story