Balijipeta: నూకలవాడలో అలజంగి జోగారావు పర్యటన.. బాధిత కుటుంబాలకు భరోసా!
Balijipeta: బలిజిపేట మండలం నూకలవాడలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పర్యటన.
Balijipeta: నూకలవాడలో అలజంగి జోగారావు పర్యటన.. బాధిత కుటుంబాలకు భరోసా!
బలిజిపేట: బలిజిపేట మండలం, నూకలవాడ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కురిటి వెంకటరమణ కుటుంబీకురాలు ఇటీవల అకాల మరణం చెందిన విషయాన్ని స్థానిక నాయకులు ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు సోమవారం మండల నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది.
అనంతరం అదే గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త పెంటయ్య తండ్రి ఇటీవల స్వర్గస్థులు అయిన విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పెంటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగినది.
ఈ పరామర్శలలో ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు పాలవలస మురళీకృష్ణ, జిల్లా ఇంటెల్క్టివల్ ఫోరం అధ్యక్షులు పి ఎస్ ఆర్ నాయుడు, మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ గోళ్ళు పకేరు నాయుడు, సీనియర్ నాయకులు గులిపిల్లి శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు వెంట పాల్గొన్నారు.




