Bobbili: విద్య వైద్యం కార్పొరేటీకరణను వ్యతిరేకించాలి

Bobbili: బొబ్బిలి ఎస్.ఎస్.ఎస్ డిగ్రీ కళాశాలలో 'రాష్ట్ర అభివృద్ధి - సమగ్ర పరిశీలన' సదస్సు జరిగింది.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 26 Jun 2026 3:34 PM IST
Bobbili
X

Bobbili: విద్య వైద్యం కార్పొరేటీకరణను వ్యతిరేకించాలి

బొబ్బిలి: విద్య, వైద్యం కార్పొరేటీకరణను వ్యతిరేకించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. బొబ్బిలి పట్టణంలోని ఎస్.ఎస్.ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రాష్ట్ర అభివృద్ధి - సమగ్ర పరిశీలన అంశంపై సదస్సు జరిగింది. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందకపోవడంతో ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం, విద్యా సంస్థలలో విద్యను కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఆర్థిక, ప్రాంతీయ, మానవ, సమీకృత, సుస్థిర అభివృద్ధిపై కేంద్రికరణ చేయాలన్నారు.

విభజన చట్టం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. నాగావళి, ఝంజావతి, వంశదార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు కేటాయించి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రైతులు పండించే పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 1/70 చట్టం అమలు చేయాలన్నారు. స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఉపాధి కల్పనకు పారిశ్రామిక అభివృద్ధి చేయాలన్నారు. ఆర్థిక, ప్రాంతీయ, మానవ అభివృద్ధి చెందాలన్నారు. ఉచిత విద్య, వైద్యం అందించి కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితి ప్రభుత్వాలకు సూచించినట్లు చెప్పారు.

గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో జ్వరం వస్తే డోలిలా మోత తప్పడం లేదన్నారు. ఖనిజ సంపదను ప్రైవేట్ సంస్థలకు దారదత్తం చేయడం వలన అవసరానికి మించి తవ్వకాలు జరిపి పర్యావరణానికి హాని చేస్తున్నారని విమర్శించారు. ఓడ రేవులకు వ్యతిరేకం కాదని, ఓడ రేవులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

సుస్థిర అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కోశాధికారి జి.మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి దివాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజగోపాల్, జిల్లా అధ్యక్షుడు ఎంవిఎన్ వెంకటరావు, ప్రధాన కార్యదర్శి రమణ ప్రభాత్, గౌరవ అధ్యక్షులు కె.శివానంద్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు కర్రి సత్యనారాయణ, యుటిఎఫ్ నాయకులు విజయగౌరి, సమత కన్వీనర్ జి.నిర్మల, జెవివి నాయకులు ఎస్వి రమణమూర్తి, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story