Gajapathinagaram: గజపతినగరం సర్వీసింగ్ సెంటర్‌లో కరెంట్ షాక్‌తో యువకుడు

Gajapathinagaram: విజయనగరం జిల్లా గజపతినగరంలో విషాదం. బైక్ సర్వీసింగ్ చేస్తుండగా కరెంట్ షాక్‌తో 17 ఏళ్ల గణేష్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 14 July 2026 8:30 PM IST
Gajapathinagaram
X

Gajapathinagaram: గజపతినగరం సర్వీసింగ్ సెంటర్‌లో కరెంట్ షాక్‌తో యువకుడు

గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మెయిన్ రోడ్డులోని ఓ కారు మరియు బైక్ సర్వీసింగ్ సెంటర్లో విషాదం చోటుచేసుకుంది.

17 సంవత్సరాల లోచర్ల గణేష్ అనే యువకుడు బైకుకు వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా అనుకోకుండా కరెంట్ షాక్ గురయ్యాడు. వెంటనే సహచరులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనతో సర్వీసింగ్ సెంటర్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయసులోనే గణేష్ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story