Garividi: గరివిడి ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన

Garividi: గరివిడిలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్. సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని టీడీపీ నేత కిమిడి రామ్ మల్లిక్ రైతులకు పిలుపు.

Venkata Thirumala
Published on: 19 July 2026 5:04 PM IST
Garividi
X

Garividi: గరివిడి ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన

గరివిడి: విజయనగరం జిల్లా గరివిడిలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్. సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని టీడీపీ నేత కిమిడి రామ్ మల్లిక్ రైతులకు పిలుపు. విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్థమూరు గ్రామంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. మాట్లాడుతూ ఆయన, సాంప్రదాయ వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు వైవిధ్యీకరణకు ఆయిల్ పామ్ సాగు ఉత్తమ ప్రత్యామ్నాయం అని అన్నారు. ఆయిల్ పామ్ అధిక దిగుబడితో పాటు 25-30 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుందని తెలిపారు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ రైతులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఉద్యాన శాఖ ద్వారా నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సలహాలు, బిందు సేద్య పరికరాలకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లాలో అనుకూల ప్రాంతాల్లో రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

మండల టీడీపీ అధ్యక్షులు సారిపాక సురేష్, జిల్లా తెలుగు రైతు సంఘ అధ్యక్షులు పైలా బలరాం, అర్థమూరు మాజీ సర్పంచ్ రమణమూర్తి, ఉద్యానశాఖ అధికారిణి యం. అనూష, గ్రామ ఉద్యాన సహాయకులు ఎ. పార్థసారథి, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story