Garividi: గరివిడిలో బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై విస్తృత అవగాహన సదస్సు!

Garividi: విజయనగరం జిల్లా గరివిడి ప్రాజెక్ట్ స్థాయిలో టీనేజ్ గర్భిణీలు, బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 25 July 2026 7:03 PM IST
Garividi
X

Garividi: గరివిడిలో బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై విస్తృత అవగాహన సదస్సు!

గరివిడి: ఈ రోజు గరివిడి ప్రాజెక్ట్ స్థాయిలో టీనేజ్ గర్భిణీలు, బాల్యవివాహాలు, POCSO ACT మరియు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువ సమయం పిల్లలతో గడపాలని, పిల్లలకు మొబైల్ వాడకాన్ని తగ్గించేలా చూడడం తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత అని సూచించారు.

అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, వుమెన్ హెల్ప్ లైన్ 181 మరియు వన్ స్టాప్ సెంటర్ సర్వీసెస్ గురించి వివరంగా తెలియజేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, POCSO Act కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారిణి CDPO శ్రీమతి ఆరుద్ర గారు, గుర్ల MPDO ఆఫీస్ A.O. గారు, విజయనగరం WDCW నోడల్ ఆఫీసర్ శ్రీ తవిటినాయుడు గారు, న్యాయవాది శ్రీమతి K. బుయెలా రాణి గారు, మెడికల్ & హెల్త్ అధికారిణి శ్రీమతి నాగమణి గారు, 1098 సిబ్బంది మీనా, ప్రమీల, భారతి, ICDS సూపర్వైజర్లు శకుంతల, పద్మ, భారతి, శుభలక్ష్మి, జ్యోతి, ఉమ తో పాటు కిషోర్ బాలికలు, తల్లులు, అంగన్వాడి వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story