Komarada: 'గట్టు మీద చెట్టు' ప్రారంభం మొక్కలు నాటిన కలెక్టర్ ప్రభాకర్!
Komarada: బిన్నిడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ, రైతులకు అదనపు ఆదాయమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "గట్టు మీద చెట్టు" కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
Komarada: 'గట్టు మీద చెట్టు' ప్రారంభం మొక్కలు నాటిన కలెక్టర్ ప్రభాకర్!
కొమరాడ: పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "గట్టు మీద చెట్టు" కార్యక్రమం కొమరాడ మండలం బిన్నిడి గ్రామంలో బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి మొక్కను నాటి, నీరు పోసి అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ మహోత్సవంలో స్థానిక శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఇందులో భాగస్వామ్యమై మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రైతులు తమ పొలాల గట్ల వెంబడి ఉపయోగకరమైన మొక్కలను నాటడం ద్వారా పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, భవిష్యత్తులో వారికి అదనపు ఆదాయ వనరుగా మారుతుందని స్పష్టం చేశారు. భూసార పరిరక్షణకు, ఆక్రమణలకు గురికాకుండా రక్షణ కలుగుతుందని చెప్పారు.
ఎమ్మెల్యే టి.జగదీశ్వరి మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని, బిన్నిడి గ్రామ ప్రజలు మరియు రైతులు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం సంతోషదాయకమని అన్నారు.




