Srungavarapukota: విజయనగరం జిల్లాలో దొంగల బీభత్సం గుడిలో నగలు అపహరణ!
Srungavarapukota: విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని శ్రీ రామాలయంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. మూడు తులాల బంగారం, ఏడు తులాల వెండి ఆభరణాలను అపహరించారు.
శృంగవరపుకోట: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ రామాలయంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని సుమారు మూడు తులాల బంగారం, ఏడు తులాల వెండి ఆభరణాలను అపహరించారు.
దొంగలు ఏడు వెండి కిరీటాలు, అమ్మవారి మెడలో ఉన్న రెండు జతల బంగారు శతమానాలు, బంగారు బొట్లు తదితర విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఎస్.కోట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కాలంలో ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని దొంగలు వరుస చోరీలకు పాల్పడుతుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story




