Bobbili: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం.. అధికారులకు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్!
Bobbili: బొబ్బిలి ఐటిఐ కాలనీలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
Bobbili: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం.. అధికారులకు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్!
Bobbili: బొబ్బిలి పట్టణం ఐటిఐ కాలనీలో గొల్లపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 42 ఇండోర్ స్టేడియం రోడ్డు మార్గాన్ని ఆక్రమించుకొని దర్జాగా ఇంటి నిర్మానం చేపడుతున్నారని,రైతు సంఘం నాయకులు వేమిరెడ్డి లక్ముం నాయుడు,విద్యార్థి జేఏసీ నాయకుడు సాయికిరణ్ యాదవ్ ఆరోపించారు.ఈ విషయమై ప్రజా సంఘ నాయకులు మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి,తాహాసీల్దార్ ఎం శ్రీను కు తెలియపరచినప్పటికీ పట్టించుకోవడంలేదని అన్నారు.
వారు మాట్లాడుతూ.. బొబ్బిలి ఇందిరమ్మ కాలనీ ఐటిఐ కాలనీ లో లక్షరాది రూపాయల విలువ చేసినటువంటి ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమణదారులు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారని, బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం ఎన్నోసార్లు నాయకులను ప్రభుత్వాలను అడిగినప్పటికీ ప్రభుత్వ స్థలము లేదని అన్నారు. మరి ప్రభుత్వ స్థలాలు అక్రమంగా ఆక్రమించుకోవడానికి మాత్రం ప్రభుత్వ స్థలాలు ఉన్నాయా వారికి నాయకుల,అధికారులు కొమ్ముకోస్తున్నారని, అన్నారు. తక్షణమే ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




