Gurla: గుర్లలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల అవగాహన సదస్సు!
Gurla: విజయనగరం జిల్లా గుర్లలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Gurla: గుర్లలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల అవగాహన సదస్సు!
గుర్ల: గుర్ల లో యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని గుర్ల సబ్ ఇన్‌స్పెక్టర్ నారాయణరావు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ నిరోధక దినోత్సవం సందర్భంగా గుర్ల జంక్షన్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
"మాదకద్రవ్యాలు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజ భవిష్యత్తును నాశనం చేస్తాయి. డ్రగ్స్ వినియోగం, నిల్వ, రవాణా చట్టరీత్యా నేరం" అని SI నారాయణరావు హెచ్చరించారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాధ్యతాయుతమైన జీవితం గడపాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




