Gurla: గుర్లలో వ్యవసాయ మోటార్ల పంపిణీలో అవకతవకలు - రాజేష్ వర్మ

Gurla: గుర్లలో వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీలో లంచాలు తీసుకుంటూ అన్యాయం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ ఆరోపణ.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 13 Aug 2026 9:03 PM IST
Gurla
X

Gurla: గుర్లలో వ్యవసాయ మోటార్ల పంపిణీలో అవకతవకలు - రాజేష్ వర్మ

గుర్ల: రైతులకు వ్యవసాయ మోటార్లు ఇచ్చే విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ రాజేష్ వర్మ గారు ఆరోపించారు.

ముందుగా అప్లై చేసుకున్న రైతులను పక్కనపెట్టి, వెనుక అప్లై చేసిన రైతులకు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. ముందు అప్లై చేసిన రైతులు "మాకు ఎందుకు ఇవ్వలేదు" అని అడగడానికి సబ్ స్టేషన్‌కు వస్తే, అక్కడ లంచాలు తీసుకొని వెనుక వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

ఈ విధానం వల్ల ముందు అప్లై చేసుకున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ గుర్ల పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుందని రాజేష్ వర్మ గారు పేర్కొన్నారు.

రైతులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, అధికారులు వెంటనే స్పందించి పారదర్శకంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story