Vizianagaram: ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్!
Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Vizianagaram: ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్!
విజయనగరం: విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి సర్కిల్ పరిధిలోని గుర్ల పోలీస్ స్టేషన్ లో ఈరోజు DSP ఎస్. రాఘవులు గారు పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ మధ్యకాలంలో పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జరుగుతూ ఉండగా పలు ఫిర్యాదులు రావడంతో, జిల్లా SP ఏ.ఆర్. దామోదర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
చీపురుపల్లి సర్కిల్ CI జి. శంకర్రావు గారు, గుర్ల SI పి. నారాయణరావు గారు మరియు వారి బృందం చాకచక్యంగా వ్యవహరించి ఈ దొంగల ముఠాను పట్టుకోవడంలో విజయం సాధించారని DSP తెలిపారు.
అరెస్టైన ముద్దాయిల వివరాలు:
ఆవాల రాజేష్ - గరికి వలస, వేముల వాసు - కెల్ల గ్రామం, టి. వెంకట్ పృథ్వి రాజ్ - నెల్లిమర్ల, కెల్ల అనిల్ కుమార్ అలియాస్ కుమార్ - కెల్ల గ్రామం, నిందితులపై FIR నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని DSP రాఘవులు తెలిపారు.
దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన చీపురుపల్లి సర్కిల్ CI జి. శంకర్రావు గారిని, గుర్ల SI పి. నారాయణరావు గారిని మరియు వారి బృందాన్ని DSP గారు ప్రత్యేకంగా అభినందించారు. పాత్రికేయ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




