Gurla: గుర్లలో డిజే నిర్వాహకులకు పోలీసుల అవగాహన!

Gurla: గుర్ల పోలీస్ స్టేషన్‌లో డిజే నిర్వాహకులకు అవగాహన సదస్సు. అనుమతులు తప్పనిసరి అని, రాత్రి 10 దాటితే చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్సై హెచ్చరిక.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 5 Sept 2026 5:05 PM IST
Gurla
X

Gurla: గుర్లలో డిజే నిర్వాహకులకు పోలీసుల అవగాహన!

Gurla: ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో DJ సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీపురుపల్లి SDPO గారు, చీపురుపల్లి సర్కిల్ CI గారు, గుర్ల ఎస్సై గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, వినాయక చవితి వేడుకల్లో DJ సౌండ్ నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసు శాఖ నుండి ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నిర్ణీత శబ్ద పరిమితిని మించరాదని, రాత్రి 10 గంటల తర్వాత DJ లు వినియోగించరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

ప్రజల ప్రశాంతత, ఆరోగ్య భద్రతలకు భంగం కలగకుండా, వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story