Gurla: కేవలం 24 గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదించిన గుర్ల పోలీసులు!

Gurla: విజయనగరం జిల్లా గుర్ల పరిధిలో మిస్సింగ్ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు. భార్య, ఇద్దరు పిల్లలను సురక్షితంగా రక్షించి కుటుంబానికి అప్పగించిన ఎస్‌ఐటీం.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 5 July 2026 3:09 PM IST
Gurla
X

Gurla: కేవలం 24 గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదించిన గుర్ల పోలీసులు!

గుర్ల: గుర్ల మండలంలో జరిగిన ఒక మిస్సింగ్ కేసును గుర్ల పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని గుర్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జూలై 4న గుర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందిన వెంటనే గుర్ల ఎస్‌ఐ శ్రీ పి. నారాయణ రావు గారు వెంటనే కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రోజులోపే ఆ మహిళ, ఇద్దరు పిల్లల ఆచూకీని గుర్తించారు.

అనంతరం వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కుటుంబాన్ని తిరిగి తెచ్చినందుకు బాధితుడు ఎస్‌ఐ నారాయణ రావు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఘటనపై గ్రామ పెద్దలు, స్థానికులు గుర్ల పోలీసుల చురుకైన పనితీరును అభినందించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story