Gurla: ఈ-డార్ (e-DAR) పోర్టల్‌లో గుర్ల పీఎస్ టాప్!
Gurla: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన e-DAR పోర్టల్‌లో వివరాలను అప్‌లోడ్ చేయడంలో విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ ఏపీలోనే మొదటి స్థానంలో నిలిచింది.
Gurla: ఈ-డార్ (e-DAR) పోర్టల్‌లో గుర్ల పీఎస్ టాప్!
గుర్ల: రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు వెంటనే పరిహారం అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన e-DAR - Electronic Detailed Accident Report పోర్టల్‌లో అన్ని ఫారాలను అప్‌లోడ్ చేయడంలో విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించింది
ఈ ఘనత వెనుక గుర్ల SI శ్రీ పి.నారాయణరావు గారి సహకారం, మార్గదర్శకత్వంతో కానిస్టేబుల్ మురళీ కృషి కీలకంగా నిలిచింది. వీరి చొరవను అభినందిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్ కానిస్టేబుల్ మురళీని ప్రత్యేకంగా ప్రశంసించారు. బాధితులకు సకాలంలో పరిహారం అందేలా సాంకేతికతను సమర్థంగా వినియోగించుకున్నందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.
e-DAR పోర్టల్ ప్రయోజనం
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే FIR, మహజర్నామా, స్పాట్ ఫోటోలు, పోస్టుమార్టం రిపోర్ట్ వంటి అన్ని కీలక పత్రాలను e-DAR పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు, ట్రిబ్యునల్‌లు వెంటనే ప్రాసెస్ చేసి బాధితులకు లేదా మృతుల కుటుంబాలకు త్వరగా పరిహారం మంజూరు చేస్తాయి. దీంతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బంది తగ్గుతుంది.
ఈ అభినందన కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ శ్రీ ఎస్.రాఘవులు గారు, చీపురుపల్లి సీఐ గారు మరియు గుర్ల SI శ్రీ పి.నారాయణరావు గారు పాల్గొన్నారు. ప్రజా సేవలో సాంకేతికతను ఉపయోగించుకుంటూ గుర్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని అధికారులు కొనియాడారు.




