Gurla: విద్యార్థులకు వ్యక్తిగత భద్రతపై గుర్ల ఎస్ఐ కీలక సూచనలు

Gurla: విజయనగరం జిల్లా గుర్ల మండల పరిధిలోని పెదనగల్లవ ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' పై ఎస్ఐ అవగాహన సదస్సు నిర్వహించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 23 Jun 2026 12:30 PM IST
Gurla
X

Gurla: విద్యార్థులకు వ్యక్తిగత భద్రతపై గుర్ల ఎస్ఐ కీలక సూచనలు

గుర్ల: ఈరోజు గుర్ల SI గారు పెదనగల్లవ MPP స్కూల్‌ను సందర్శించి విద్యార్థులకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, అనుచిత ప్రవర్తనను గుర్తించడం, ఎలాంటి అసౌకర్యం అనిపించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా విశ్వసనీయ పెద్దలకు చెప్పాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు.

బాలల రక్షణ, POCSO చట్టం 2012 నిబంధనలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి, ఎలాంటి భయం లేకుండా మాట్లాడాలని, వారి భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని SI గారు తెలిపారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story