Giddalur: వెల్లుపల్లిలో మిరప పంట బీమాపై ఉద్యాన శాఖ ముమ్మర అవగాహన!

Giddalur: వెల్లుపల్లిలో మిరప పంట బీమాపై, దిగువమెట్టలో మామిడి రైతులకు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) పై ఉద్యాన అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 30 July 2026 11:34 PM IST
Giddalur
X

Giddalur: వెల్లుపల్లిలో మిరప పంట బీమాపై ఉద్యాన శాఖ ముమ్మర అవగాహన!

గిద్దలూరు: వెల్లుపల్లి గ్రామంలో మిరప పంట బీమాపై అవగాహన – దిగువమెట్టలో మామిడి రైతులకు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్‌పై శిక్షణ, మండలంలోని వెల్లుపల్లి గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిరప (ఎర్ర మిరప) పంట బీమాపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారులు మాట్లాడుతూ, మిరప పంటకు పంట బీమా రైతులకు ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని నష్టాల సమయంలో ఆర్థిక భరోసాను కల్పిస్తుందని తెలిపారు. మిరప పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు జూలై 31 చివరి తేదీ కావున, అర్హులైన రైతులందరూ తప్పకుండా నిర్ణీత గడువులోపు ప్రీమియం చెల్లించి పంట బీమా సదుపాయాన్ని పొందాలని సూచించారు.

అనంతరం దిగువమెట్ట గ్రామంలో మామిడి రైతులకు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరగడం, తేమ సంరక్షణ, కలుపు నియంత్రణ, నేల సారవంతత మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దిగువమెట్ట గ్రామంలోని 15 ఎకరాల మామిడి తోటల్లో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి విత్తనాలు చల్లడం జరిగింది. రైతులు ఈ విధానాన్ని విస్తృతంగా అమలు చేసి ఉద్యాన పంటలో ఉత్పాదకతను పెంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story