Kurupam: గ్రామీణ విద్యార్థుల కోసం హెచ్‌పీసీఎల్ కంప్యూటర్ల వితరణ

Kurupam: కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హెచ్‌పీసీఎల్ (HPCL) సంస్థ 4 కంప్యూటర్లను వితరణగా అందజేసింది.

V.SESHU	, KURUPAM
Published on: 15 May 2026 10:32 AM IST
Kurupam
X

Kurupam: గ్రామీణ విద్యార్థుల కోసం హెచ్‌పీసీఎల్ కంప్యూటర్ల వితరణ

కురుపాం: హెచ్‌పీసీఎల్ (హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా కురుపాం DPVD జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 4 కంప్యూటర్లను వితరణగా అందించింది. యస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ అధికారులు కంప్యూటర్లను పాఠశాలకు అందజేశారు.ఈ సందర్భంగా హెచ్‌పీసీఎల్ హెచ్‌ఆర్ మేనేజర్ శ్రీ సుమన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కంప్యూటర్ విజ్ఞానం అందించాలనే సదుద్దేశంతో ఈ కంప్యూటర్లను అందిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాంకేతిక పరిజ్ఞానంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో ZPHS ప్రధాన ఉపాధ్యాయులు తోట శంకరరావు, ఉపాధ్యాయులు ఆకుల జగదీష్, సంతోష్, బి.ఎల్. ప్రకాష్, యస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్, సన్యాసి రాజు తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్లను అందించిన హెచ్‌పీసీఎల్ యాజమాన్యానికి, యస్ సొసైటీ సభ్యులకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story