Vizianagaram: సీతంలో ఇండోసోల్ పూల్ క్యాంపస్ డ్రైవ్ - అర్హతలు ఇవే!

Vizianagaram: విజయనగరం సీతం కళాశాలలో సెప్టెంబర్ 3న ఇండోసోల్ సోలార్ పూల్ క్యాంపస్ డ్రైవ్. బీటెక్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాలు. పూర్తి వివరాలు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 2 Sept 2026 9:24 AM IST
Vizianagaram
X

Vizianagaram: సీతంలో ఇండోసోల్ పూల్ క్యాంపస్ డ్రైవ్ - అర్హతలు ఇవే!

Vizianagaram: సత్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పూల్‌ క్యాంపస్‌ నియామక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌ఎస్‌వీ సొల్యూషన్స్‌ సహకారంతో సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటలకు సీతం కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

బీటెక్‌లో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌తో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు. 2023 నుంచి 2026 వరకు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులని కళాశాల యాజమాన్యం తెలిపింది.

ఎంపికైన వారికి విద్యార్హతను బట్టి వార్షిక వేతన ప్యాకేజీ అందించనున్నారు. బీటెక్‌ అభ్యర్థులకు రూ.2.16 లక్షలు, డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు రూ.1.90 లక్షలు, ఐటీఐ అభ్యర్థులకు రూ.1.80 లక్షలు వేతనంగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రముఖ సోలార్‌ సంస్థలో ఉద్యోగం పొందేందుకు ఈ నియామక కార్యక్రమం మంచి అవకాశమని సీతం కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామ్మూర్తి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story