Parvathipuram: ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ ప్రారంభం: జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి చినమేరంగిలో ప్రారంభించి అవగాహన కల్పించారు.

V.SESHU	, KURUPAM
Published on: 20 Aug 2026 10:17 PM IST
Parvathipuram
X

Parvathipuram: ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ ప్రారంభం: జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత చేరువగా వెళ్లి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు పోలీస్ సేవలు, ప్రజా భద్రతపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్రంలోనే, జిల్లాలోనే తొలిసారిగా రూపొందించిన వినూత్న కార్యక్రమం “ఇంటింటికీ... మన్యం పోలీస్” చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని చినమేరంగి గ్రామం రెల్లివీధిలో చినమేరంగి పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆగష్టు 20న నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై గ్రామ ప్రజలు, యువతతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రజల గడప వద్దకే పోలీస్ శాఖను తీసుకువెళ్లి, ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి అండగా నిలవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని “మీ రక్షణ కోసం... మీ భద్రత కోసం... మీ సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీస్ శాఖ అహర్నిశలు పనిచేస్తుంది” అని ప్రజలకు జిల్లా ఎస్పీ గారు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం కల్పించడంతో పాటు, ప్రతి కుటుంబానికి పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నాయనే భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం ప్రదానంగా నాలుగు అంశాలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయని వాటిలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాలు, మహిళలు–చిన్నారుల పై నేరాలు, రోడ్ సేఫ్టీ తదితర అంశాల పట్ల ,ప్రజలకు అవగాహన కల్పిస్తూ.

ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్స్ తదితర అంశాలపై కరపత్రాలు పంపిణి, స్టిక్కర్స్ ఇంటింటికి అతికించి విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు చుట్టుపక్కల ఇంట్లో ప్రజలకు అవగాహన కరపత్రాలు పంపిణీ చేసి వాటిపట్ల అవగాహన కల్పించి , ఇళ్ళకు సిక్కర్స్ను అతికించారు. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ లో యువతకు క్రీడల వైపు ప్రోత్సహించేలా వాలీ బాల్ కిట్స్ ప ఎస్పీ గారి చేతుల మీదుగా పంపిణీ చేసారు.

“ఇంటింటికీ... మన్యం పోలీస్” కార్యక్రమం ద్వారా గడపగడపకూ పోలీస్ అడుగు... ప్రతి కుటుంబానికి భద్రతా భరోసా అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో మమేకమవుతూ డిసంబెర్ నెలవరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు, పోలీస్ సేవలను మరింత చేరువ చేయనున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఎటువంటి సమస్య ఉన్నా సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను లేదా సంబంధిత పోలీస్ అధికారులను గాని, స్టిక్కర్స్లో వున్న టోల్ ఫ్రీ నంబర్స్ గాని సంప్రదించాలని ఎస్పీ గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటుగా డిఎస్పీ ఎం.రాంబాబు, చినమేరంగి పట్టణ సిఐ తిరుపతి రావు , ఎస్సై నీలకంతం, ఎల్విన్పేట ఎస్సై శివప్రసాద్, జియ్యమ్మవలస ఎస్సై ప్రశాంత్ మరియు సిబ్బంది, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో ప్రజలు,యువత పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story