Parvathipuram: బాల సంజీవని టెండర్లలో భారీ అక్రమాలు - AITUC

Parvathipuram: బాల సంజీవని పథకం టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని, వాటిని తక్షణమే రద్దు చేసి విచారణ జరపాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి RVS కుమార్ డిమాండ్ చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 10 Sept 2026 4:38 PM IST
Parvathipuram
X

Parvathipuram: బాల సంజీవని టెండర్లలో భారీ అక్రమాలు - AITUC

పార్వతీపురం: బాల సంజీవని పథకం టెండర్లలో భారీ అక్రమాలకు తెరలేపారని ఎఐటియుసి మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ ఆరోపించారు. గురువారం ఎఐటియుసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.172.80 కోట్ల విలువైన టెండర్లలో పారదర్శకత లోపించిందని విమర్శించారు.

ఐదు మంది పెద్దలకే కాంట్రాక్టులు కట్టబెట్టేలా నిబంధనలు రూపొందించారని, చిన్న సంస్థలను తప్పించే విధంగా 5,583 పాయింట్ల నిబంధన పెట్టారని దీనిపై రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారని తెలిపారు . టెండర్ల ప్రక్రియకు 30 రోజుల గడువు ఇవ్వాల్సి ఉండగా 15 రోజుల్లోనే పూర్తి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఈ అంశంపై సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసినట్లు కుమార్ తెలిపారు. బాల సంజీవని టెండర్లను రద్దు చేసి సమగ్ర విచారణ జరపాలని, జిల్లాల వారీగా పారదర్శకంగా కొత్త టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈ.వి నాయుడు, మండల కార్యదర్శి సీతారాం దొర పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story